Yuvraj Singh : భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారు ఆభరణాలతో పాటు రూ.75 వేల నగుదు ఎత్తుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లోని పంచ్కులో ఎండీసీ సెక్టర్(ADC Sector) 4లోని యువీ ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చొరబడ్డారు. విలువైన నగలు, ఆభరణలతో పాటు భారీగా డబ్బులు కాజేశారు. దాంతో, యూవీ తల్లి షబ్నమ్ సింగ్(Shabnam Singh) హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువరాజ్ తల్లి షబ్నమ్ 2023 సెప్టెంబర్ నుంచి గుర్గావ్లో ఉంటోంది. ఆమె ఈ మధ్యే ఛత్తీస్‌గఢ్‌లోని ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లి చూసేసరికి ఇళ్లంతా చిందరవందరగా ఉంది. ఇంట్లోని విలువైన ఆభరణాలు, రూ.75 వేల నగదు కనిపించలేదు. మొత్తంగా రూ.1.75 లక్షల సొత్తు చోరీకి గురవ్వడంతో ఆందోళన చెందిన షబ్నమ్ హర్యానా పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే.. ఇదంతా ఇంట్లో పనిచేసే వాళ్లు, వంట మనిషి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
భార్య హేజెల్ కీచ్, కొడుతో యూవీ
భారత జట్టు గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైన యువరాజ్ సింగ్ రెండు వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచాడు. 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూవీ ఓ రేంజ్లో చెలరేగాడు. స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపి చరిత్ర సృష్టించాడు.
యువరాజ్ సింగ్, స్టువార్ట్ బ్రాడ్
అనంతరం 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ యూవీ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. బ్యాటుతో, బంతితో రాణించి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు అందకున్నాడు. అయితే..మెడియస్టినల్ సెమినోమా(mediastinal seminoma) అనే అరుదైన క్యాన్సర్ బారిన పడిన యూవీ.. అమెరికాలోని బోస్టన్‌లో కీమోథెరపీ చికిత్స తీసుకున్నాడు. ఆ మహమ్మారి నుంచి 2012లో బయటపడిన అతడు మళ్లీ మైదానంలో ఫ్యాన్స్‌ను అలరించాడు. యూవీ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్స్‌లో ఆడుతున్నాడు. న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.