శ్రీనగర్: ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మపై వీడియో తీసిన కశ్మీర్ యూట్యూబర్ ఫైసల్ వాని క్షమాపణలు చెప్పారు. నుపుర్ను నరికినట్లు తన వీడియోలో ఫైసల్ చూపించాడు. దాన్ని ఆన్లైన్లో అతను పోస్టు చేశాడు. మతపరమైన ఆరోపణలు చేసేవాళ్ల తల నరకడమే శిక్ష అని తన వీడియోలో ఆ యూట్యూబర్ పేర్కొన్నారు. గొడ్డలితో నుపుర్ తలను నరికినట్లు ఆ వీడియోలో గ్రాఫిక్స్ ప్రజెంట్ చేశాడు. నుపుర్ తలను విసిరేసినట్లుగా చూపించాడు. అయితే ఈ వీడియోను పోస్టు చేసి తప్పు చేసినట్లు ఫైసల్ క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు. అమాయకుడినైన నేను ఆ వివాదంలో ఇరుక్కున్నట్లు చెప్పాడు. మతపరమైన భావాలను కించపరడం తన ఉద్దేశం కాదు అని, ఎందుకంటే ఇస్లాం మతం సహనాన్ని బోధిస్తుందని ఫైసల్ అన్నాడు. క్షమాపణలకు సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశాడు.