Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
Dhruv Rathee : యూట్యూబర్ ధృవ్రాఠీకి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. 2018 నాటి ఒక పరువునష్టం కేసులో బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ధృవ్రాఠీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
Dhruv Rathee : యూట్యూబర్ ధృవ్రాఠీకి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. 2018 నాటి ఒక పరువునష్టం కేసులో బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ధృవ్రాఠీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. ధృవ్రాఠీ యూట్యూబర్‌గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తుంటాడు. 2018లో బీజేపీ ఐటీ సెల్ పార్ట్ 2 అంటూ ఒక వీడియో చేశాడు.
ఈ వీడియో బీజేపీ సహా సంబంధిత వ్యక్తుల్ని కించపరిచేలా ఉందంటూ వికాస్ సంకృత్యన్ అలియాస్ వికాస్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పరువునష్టం కేసుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గతంలో ధృవ్రాఠీకి పలుమార్లు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. కారణం అతడు ఆస్ట్రియా సహా విదేశాల్లో ఉండటమే. 2019లో గుర్గావ్లోని అతడి ఇంటికి నోటీసులు ఇచ్చినప్పటికీ.. అతడు ఇండియాలో లేడు. అయితే, ఇంతకాలానికి అతడు ఇటీవల ఇండియా వచ్చాడు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్నాడు. ఇప్పుడు అతడు ఇండియాలోనే ఉండటంతో మరోసారి వికాస్ పాండే తరఫు లాయర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు స్పందించింది. నిందితుడిగా ఉన్న ధృవ్రాఠీకి బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో అప్పటి కేసులో మరోసారి కొత్తగా అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో గుర్గావ్లోని ధృవ్రాఠీ ఇంటికి మరోసారి నోటీసులు అందించనున్నారు పోలీసులు. అతడి ఇంటి బయట సెక్యూరిటీ సమక్షంలో నోటీసు జారీ చేయాలని భావిస్తున్నారు.
అయితే, ఇది బెయిలబుల్ కేసు కావడంతో అతడికి వెంటనే బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ ఐటీ సెల్‌పై ధృవ్రాఠీ రూపొందించిన వీడియో కేసుకు, అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధం ఉంది. ఈ వీడియోను కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. దీంతో ఆయనపై కూడా కేసు నమోదైంది. కానీ, ఆయన కోర్టుకు క్షమాపణ చెప్పాడు. దీంతో కేసు సమసిపోయింది. ధృవ్రాఠీపై ఇతర మతపరమైన కేసులు కూడా ఉన్నాయి. వాటిపై కూడా ఇప్పుడు విచారణ సాగే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

