DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
DMK | తమిళనాడు (Tamil Nadu) లోని ప్రతిపక్ష డీఎంకే పార్టీ (DMK Party) కేంద్ర ఎన్నికల సంఘం (Centrel Election Commission) పై, ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఈవీఎం (EVM) ల స్థానంలో తిరిగి బ్యాలెట్ విధానాన్నే ప్రవేశపెట్టాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.
DMK : తమిళనాడు (Tamil Nadu) లోని ప్రతిపక్ష డీఎంకే పార్టీ (DMK Party) కేంద్ర ఎన్నికల సంఘం (Centrel Election Commission) పై, ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఈవీఎం (EVM) ల స్థానంలో తిరిగి బ్యాలెట్ విధానాన్నే ప్రవేశపెట్టాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కూడా తీర్మానించారు.
ఇవాళ (శనివారం) ఉదయం 11 గంటలకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం నాలుగు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలనేది వాటిలో ఒకటి.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే తొలగించాలనేది వాటిలో తొలి తీర్మానంగా ఉన్నది. ఎన్నికల నిర్వహణలో ఆయన వైఫల్యం చెందారని ఆరోపిస్తూ.. ఆయనను వెంటనే తొలగించాలని ఆ తీర్మానంలో డిమాండ్ చేశారు. అయితే ఎలాంటి అవకతవకలు జరిగాయనేది మాత్రం పార్టీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా పేర్కొనలేదు. అయితే రాష్ట్రపతికి సమర్పించే వినతిపత్రంలో పూర్తి వివరాలు పొందుపరచనున్నట్లు తెలుస్తున్నది.
విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ డీఎంకే మరో తీర్మానం చేసింది. అయితే ఏ విద్యార్థి సంఘాలకు వారు మద్దతిస్తున్నారో స్పష్టంగా తెలియజేయలేదు. ఇక కాంగ్రెస్, అధికార టీవీకే పార్టీల ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ మూడో తీర్మానం చేసింది. ఏయే అంశాల్లో ఈ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయో కూడా తీర్మానంలో వివరించలేదు. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్రపతిని కోరుతూ నాలుగో తీర్మానం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

