‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
బూర్గంపహాడ్ మండలం సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఈవో గుగులోత్ రవికుమార్‌కు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
– ఈవోకు ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ నేతల వినతి
బూర్గంపహాడ్, అక్టోబర్ 17 : బూర్గంపహాడ్ మండలం సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఈవో గుగులోత్ రవికుమార్‌కు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని, మురుగు కాల్వల శుభ్రత పూర్తిగా లోపించిందని, చెత్త తొలగింపులో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, అంతర్గత రహదారులకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించడం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతని గుర్తుచేశారు.
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత అధికారులు తగినచర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామికవాడలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ వినతిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, చల్లకోటి పూర్ణ, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, బెజ్జంకి కనకాచారి, భూక్యా శ్రీను, దారం కృష్ణారెడ్డి, ఆంజనేయులు, కర్రి నాగేశ్వరరావు, పంగి సురేష్, మోహన్, గుల్మహ్మద్, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు వెంకటరమణ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

