ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో శక్తి ఫౌండేషన్ 5 వ వార్షికోత్సవం సందర్భంగా యువకులు ఆదివారం రక్తదానం ( Blood Donation ) చేశారు. శక్తి ఫౌండేషన్ ( Shakti Foundation ) వ్యవస్థాపక అధ్యక్షుడు చింతనపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని నారాయణపేట యశోద కేర్ హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి రెడ్డి ( Doctor Preeti Reddy ) , సింగిల్ విండో చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. రక్త దానంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా గర్భిణులకు ప్రసవ సమయంలో రక్తం అత్యవసరమవుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. శక్తి ఫౌండేషన్ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఫౌండేషన్ అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో 25 వేల మంది రోగులకు అత్యవసర సమయంలో తెల్ల రక్త కణాలు, ప్లాస్మా, రక్తదానం చేశామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. రక్తదానం చేసిన యువకులకు శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందజేశారు.
కార్యక్రమంలో డాక్టర్ భరత్ రెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఎల్కోటి జనార్ధన్ రెడ్డి, వసంత కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యజ్ఞేశ్వర్ రెడ్డి, మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, జమీర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వడ్ల మోనప్ప, మాజీ ఉప సర్పంచ్ ఒబెదుర్ రహిమాన్, జేవీవీపీఎస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ హాజమ్మ, బీఎస్పీ మండల అధ్యక్షుడు గౌతమ్, ఎంఐఎం జిల్లా నాయకులు పాషా, మునీర్, శక్తి ఫౌండేషన్ సభ్యులు నరేష్, ఉత్తేజ్, అర్ఫత్ అలీ, అశోక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.