మహంకాళీ ఆలయంలో యువకుడి తల

- నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో దారుణం
- మృతుడు సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ వాసిగా గుర్తింపు
దేవరకొండ, జనవరి 10: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. గ్రామ సమీపంలోని మెట్టు మహంకాళి దేవాలయం విగ్రహం వద్ద మొండెం నుంచి వేరుచేసిన యువకుడి తల తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం కాలనీవాసులు మొండెం లేని యువకుడి తలను గుర్తించి పోలీసులకు సమచారం ఇచ్చారు. దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, నాంపల్లి సీఐ సత్యం పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో ఆధారాలను సేకరించారు. మృతుడిని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్‌కు చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ రమావత్ శంకర్‌నాయక్ కుమారుడు జయేందర్ (30)గా గుర్తించారు. అతను డిగ్రీ వరకు చదువుకోగా మానసిక సమస్యలతో రెండేండ్లుగా గ్రామానికి రావట్లేదు. గతంలో ఎర్రగడ్డ హాస్పిటల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు వదిలివేసినట్టు సమాచారం. అతని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జయేందర్ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

