Hyderabad | చిన్న గొడవ బాలుడి ప్రాణం తీసుకుంది. జ్యూస్: సెంటర్లో పని చేస్తున్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువకుడు గరిటెతో కొట్టడంలో బాలుడు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌కు చెందిన మోఫిల్(19), దుర్వేశ్(16) ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. టోలీచౌకిలోని ఓ జ్యూస్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మోఫిల్.. జ్యూస్ సెంటర్లోని ఒక గరిటె తీసుకుని దుర్వేశ్ తలపై బలంగా కొట్టాడు.
గరిటెతో దెబ్బ గట్టిగా తాకడంతో దుర్వేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరి పరిశీలించారు. దుర్వేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.