Yorker | కొత్త ఓటు హక్కు అచ్చిన మనవడు
కాంగ్రెస్ మీటింగ్కు పొయ్యొచ్చిండు
నాయినవ్వకు ఆరు గ్యారెంటీల పేపరిచ్చి..
ముసల్దానా ఈసారి చెయ్యికే ఓటెయ్యాలె..
అన్నడు
ఈల్లు గెలిత్తే నీ పింఛిన్ డబుల్ జేత్తరట
ఇందిరమ్మ ఇల్లు ఇత్తరట
పుణ్యానికి కరెంట్ గూడ ఇత్తరట
నువ్వు పొలంపనికి పోతవ్ గదా..
కైకిలోల్లకు గిన పన్నెండేలు ఇత్తరట
ఇగ బస్సుల యాడికి పోయినా ఫ్రీ.. ఫ్రీ..
అని మనవడు అనంగనె
ముసలమ్మ గుడ్లెర్రగ జేసి..
మనవని మీదికి లేచింది..
నీకేం తెల్సురా కాంగ్రెసోని కహానీలు
గీల్లున్నప్పుడే గదరా కరెంట్ కోసం
బాయికాడ మంచమేసుకొని పండినం
గట్ల కరెంటు పెట్టపొయ్యే గదా
మీ అయ్య కాలం జేసింది
అప్పుడు మీ అయ్యకు రూపాయి రాలే..
ఎవ్వడు ఆదుకున్న పాపాన పోలే..
నేను.. మీ అవ్వ.. కైకిలి చేసి నిన్ను సాదినం
మొన్నగా సరోజత్త మొగడు పోతే
కేసీఆర్ సారు ఐదు లచ్చలిచ్చిండు
కాంగ్రెసోళ్ల జమానాల 200 పింఛిన్ అస్తుండే
అవ్వి చేతికొచ్చినయా.. మూతికందినయా..
గిప్పుడు నెలనెలా రెండువేల పింఛిన్లొస్తున్నయి
మీ అవ్వకు రెండు వేలు రావట్టే
ఆ పైసలతోనే గద రా నీ కాలేజీ ఫీజు కట్టింది
ఇగ ఇందిరమ్మ ఇల్లంటవా
మన జాగల మనం ఇల్లు కట్టుకుంటే
70 వేలు ఇత్తమన్నరు
గల్లీ లీడర్లే సగం పైసలు దొబ్బితిరి
గా పైసలు పునాదులకు సరిపోలే
ఇజ్జత్కి అప్పు తెచ్చి చెత్తు పోసినం
ఆ అప్పు ఇంక తీరకనే పాయె
కేసీఆర్ చూడు..
సక్కగ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాండు
సావిత్రక్క ఇంటికి పోతవ్ గదా..
వాళ్ల ఇల్లెంత మంచిగుందో చూసినవ్ గదరా…
కాంగ్రెసోడు సగమే ఇచ్చిన ఇల్లు చూడు…
కేసీఆర్ సార్ ఫుల్లుగా కట్టించిన
సావిత్రక్క ఇల్లు చూడు..
ఇవన్నీ నెత్తి నాది గాదు..
కత్తి నాది గాదు అనే మాటలే
కాంగ్రెసోన్ని నమ్మితే మీ అయ్యను గలిపినట్టే..
మనల్ని కూడా కాట్లె గలుపుతరు బిడ్డా
పైలంగుండాలె..
నీ ఓటును కరాబ్ చెయ్యకు
– రాజు అతికం, 9440012834