ఓ పిల్లా జెప్పన పొయ్యి ఆ బుగ్గలు బంజెయ్.. నల్లా గూడ బందువెట్టు
ఆ ధరణి పాస్బుక్కు బీర్వ బట్టలల్ల కుక్కు
కేసీఆర్ కిట్టు కండ్లవడకుండ దాసిపెట్టు
కల్యాణలచ్చిమి చెక్కు తీస్కునేటప్పుడు దిగిన ఫొటో గిట్ల ఓరకువెట్టు
ముసల్దానా పింఛిన్ పైసలు గట్ల చేతుల పట్టుకొని తిర్గకు
ఓ అయ్యా నువ్వు ఆ అడ్ల మీద జోర సంచులు గప్పు
ఏమైందమ్మా గంతగానం ఆగమైతున్నవ్?
ఏం లేదు బిడ్డా.. గా కాంగ్రెసోళ్లు ఎలచ్చన్ పచారానికొత్తున్రు
ఆల్ల కండ్లగిట్ల పడితే.. మనకచ్చేటియన్ని గంగల కల్తయ్
గంత పాపాత్ములానే ఆల్లు..
నీకేమెరుకనే ఆల్లు గురించి
అరవై ఏండ్లు అరిగోస పెట్టింది ఆల్లే
కరెంటు ఇయ్యకపోదురు
మోటర్లు కాల్తుండే..
టాన్స్పారాలు పేల్తుండే..
పింఛిన్ బల్మీటికి 200 ఇద్దురు
ఏమిచ్చినా సగం ఆల్ల జేబులకే పోతుండే
ఇగ నీల్ల గోసైతే చెప్పనేరాదు బిడ్డా..
ఆనింటికి గుడ ఆడు నీల్లిచ్చుకునేది గాదు!
ఏ ఊల్ల జూసినా, ఏ గల్లీల జూసినా..
బిందెల జాతరే అనుకో!!
అటు కరెంటు లేక.. ఇటు నీల్లు రాక..
శేన్లన్నీ బీడుగనే ఉండేటియి
ఇప్పుడు కేసీఆర్ దయతోని నీల్లచ్చినయ్
ధరణి అచ్చినాంక భూమి మన పేరునెక్కింది
పంటపంటకూ పైసలత్తున్నయ్
ఏ సావుకారి గడప తొక్కే పని లేకుండైంది
సార్ పుణ్యమాని జరంత తెల్లవడ్డం బిడ్డ
ఆ కాంగ్రెసోల్ల నజర్ మంచిది కాదు
రైతుబంధు పైసలు ఆపాలని లొల్లి పెడ్తున్నరట
నిన్న టీవీల జూసిన
ఇయ్యాల రైతుబంధు ఆపమన్నరు..
రేపు నీల్లు.. కరెంటు.. కేసీఆర్ కిట్లు..
ఎవ్వి ఇయ్యొద్దంటరు
గందుకే ఆల్ల కండ్లు పడకుండా
అన్ని దాసిపెట్టమన్న
లేకపోతే మల్లా మన బతుకు..
కాంగ్రెస్ లెక్కనే అయితది బిడ్డ!!
-రాజు అతికం, 94400 12834