మడికొండ: అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకలలో భాగంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు.
ఇందులో భాగంగా మడికొండలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల(ఆయుష్ ఆరోగ్య మందిర్) ఆధ్వర్యంలో డాక్టర్ జయప్రకాశ్, ఫార్మసిస్ట్ శ్యాం కుమార్ ఉచిత వైద్య శిబిరం చేపట్టి విద్యార్థులకు కావాల్సిన మందులను అందజేశారు. యోగా శిక్షకురాలు జి. శ్వేత యోగా శిక్షణ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ యోగా చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.