అమరావతి : ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025 పరీక్షలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu alleges ) స్పష్టం చేశారు. వైసీపీ ( YCP ) చేస్తున్న ఆరోపణల్లో ఎలాంట వాస్తవాలు లేవని కొట్టిపారేశారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఎ కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడి , తమ ప్రతిభతో డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులను అగౌరవపరిచే విధంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని ఉద్యోగాల్లో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 350 పిటిషన్లు వేశారని విమర్శించారు. తమ హయాంలో అవినీతి జరగలేదు. జరగనివ్వని అన్నారు.
గతంలో ప్రైవేట్ స్కూళ్లకు ప్రాధాన్యత ఇచ్చే తల్లిదండ్రులు నేడు ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిపారు. ప్రకృతి సేద్యం భవిష్యత్‌కు భారీ మార్పు అవుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుపడేవరకు అండగా ఉంటానని వివరించారు. ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.