DMK | ఓటమి నుంచి పాఠాలు.. డీఎంకే కీలక తీర్మానాలు
DMK | డీఎంకే పార్టీ అధ్యక్షుడు (DMK Chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేపట్టారు. పార్టీకి కొత్త రక్తాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పలు కీలక పదవులకు వయోపరిమితి (Age Limit) విధించారు. అదేవిధంగా వరుసగా రెండు పర్యాయాలకు మించి ఆ పదవుల్లో కొనసాగకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
DMK : డీఎంకే పార్టీ అధ్యక్షుడు (DMK Chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేపట్టారు. పార్టీకి కొత్త రక్తాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పలు కీలక పదవులకు వయోపరిమితి (Age Limit) విధించారు. అదేవిధంగా వరుసగా రెండు పర్యాయాలకు మించి ఆ పదవుల్లో కొనసాగకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లో జరిగిన డీఎంకే కార్యవర్గ సమావేశంలో ఈ మార్పులకు సంబంధించిన తీర్మానాలకు ఆమోదం లభించింది.
ఈ సంస్కరణలు పార్టీ సంస్థాగత వ్యవస్థలో కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తాయని డీఎంకే వర్గాలు తెలిపాయి. అదేవిధంగా తాజా మార్పులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపుతాయని భావిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. బ్రాంచ్ పార్టీ కార్యదర్శి పదవికి గరిష్ఠ వయోపరిమితిని 45 ఏళ్లుగా నిర్ణయించారు. మున్సిపల్, సిటీ, టౌన్ పంచాయతీ వార్డు కమిటీ కార్యదర్శుల వయసు 50 ఏళ్లకు మించకూడదు.
టౌన్ పంచాయతీ పార్టీ కార్యదర్శులు, ఏరియా కమిటీ కార్యదర్శులు, సిటీ కమిటీ కార్యదర్శులకు గరిష్ఠ వయోపరిమితిని 60 ఏళ్లుగా నిర్ణయించారు. జిల్లా పార్టీ కార్యదర్శుల పదవికి అత్యధికంగా 70 ఏళ్ల వరకు వయోపరిమితి విధించారు. ఈ పదవుల్లో ఎన్నికైన వారు గరిష్ఠంగా రెండు టర్మ్లు మాత్రమే కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. దాంతో పార్టీ పదవుల్లో కొత్తవారికి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
స్థానిక సంస్థాగత విభాగాల నిర్మాణంలోనూ డీఎంకే మార్పులు చేసింది. గ్రేటర్ చెన్నై కార్పోరేషన్లో ఒక్కో ఏరియా కమిటీ పరిధిలో సగటున 40 వేల మంది ఓటర్లు ఉండేలా నిర్ణయించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ సంఖ్యను 30 వేలుగా నిర్ణయించారు. సిటీ కమిటీల పరిధిలో కూడా సగటున 40 వేల మంది ఓటర్లు ఉండేలా తీర్మానం చేశారు. ఈ మార్పులను డీఎంకే ఎంపీ పీ విల్సన్ స్వాగతించారు. ఇవి పార్టీ సంస్థాగత వ్యవస్థలో మంచి నిర్మాణాత్మక సంస్కరణలని, అందరికీ మేలు చేసే నిర్ణయాలని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Age limit
- DMK
- DMK revamps
- MK Stalin
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

