Yash | యష్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ‘ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ఉపశీర్షిక. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో నేడు (గురువారం) మొదలుకానుంది. ఈ సందర్భంగా యష్, మరో నిర్మాత వెంకట్ కె.నారాయణ.. తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీసదాశివ రుద్ర సూర్య ఆలయం, ధర్మస్థలి శ్రీమంజునాథేశ్వర ఆలయం, సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రమణ్య ఆలయం.. ఇలా కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించారు. కొత్త సినిమా మొదలుపెట్టేముందు ఆలయ సందర్శన యష్ అలవాటని సమాచారం. యష్ లక్కీ నంబర్ 8 కావడంతో 8-8-8 అనే నంబర్ వచ్చే రోజున యష్ తన కొత్త సినిమాలను మొదలుపెట్టడం మొదట్నుంచీ రివాజు.