Kriti Sanon | బాలీవుడ్ నటీమణులు యామీ గౌతమ్, కృతి సనన్ మధ్య అవార్డుల విషయంలో సోషల్ మీడియాలో ఒక చిన్న వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై యామీ గౌతమ్ స్పందిస్తూ తాజాగా వివరణ ఇచ్చింది.
అసలు ఏం జరిగిందంటే?
ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ 2026లో కృతి సనన్ తన ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein) సినిమాకు గాను ఉత్తమ నటి (Best Actress) అవార్డును అందుకుంది. అయితే ఈ అవార్డు యామీ గౌతమ్ నటించిన ‘హక్’ (Haq) సినిమాలోని నటనకు రావాలని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో కృతి గెలుపును ఎద్దేవా చేస్తూ రూపొందించిన ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌ను యామీ గౌతమ్ ‘లైక్’ చేయడం నెటిజన్ల దృష్టికి వచ్చింది. దీనితో ఆమె కృతిపై అసూయతో ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై యామీ గౌతమ్ స్పందిస్తూ అది పొరపాటున జరిగిన పని అని క్లారిటీ ఇచ్చింది.
మరో నటిని తక్కువ చేస్తూ ఉన్న రీల్‌ను నేను లైక్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. మాకు ప్రతిరోజూ చాలా పోస్టులలో ట్యాగ్లు వస్తుంటాయి. అలా చూస్తున్నప్పుడు పొరపాటున ఆ లైక్ పడి ఉండవచ్చు, అది నేను కావాలని చేసిన పని కాదు అని యామి తెలిపింది. అంతేగాకుండా.. నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి చిల్లర పబ్లిసిటీ స్టంట్లు (Cheap PR tactics) చేయలేదు. నా పని మీద మాత్రమే నేను దృష్టి పెడతాను. కేవలం క్లిక్-బైట్ వార్తల కోసం ఇలాంటి చిన్న విషయాలను పెద్దది చేయవద్దు అని యామి కోరింది. తనకు అవార్డుల మీద ఉన్న అభిప్రాయం పాతదేనని, కేవలం అవార్డుల వల్ల మాత్రమే ఒకరు గొప్ప నటులు అయిపోరని ఆమె గతంలోనే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
It has come to my notice that I apparently ‘liked’ a reel that is condescending toward another actor. We get tagged in multiple things every day, and this appeared during an award-function reference like any other tag. It isn’t true and was definitely not done consciously, if…
— Yami Gautam Dhar (@yamigautam) March 5, 2026