యాదాద్రి, జనవరి 3: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారని తఢిల్లీ, ఛండీగఢ్ ఎన్నికల కమిషనర్ ఎస్కే శ్రీవాస్తవ పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి దివ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయం ముఖ మండపంలో వారికి అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్ల క్రితం స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చానని, అప్పట్లో ఆలయ నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉండటం సంతోషదాయకమని పేర్కొన్నారు.