యాదాద్రి: పవ్రిత పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వహించారు. ఉత్సవమూర్తులను పంచామృ తాలతో అభిషేకించి, అనంతరం తులసీ ప్రతాలతో అర్చన జరిపారు.
దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. బాలాలయంలోని మహా మండ పంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వ క్సేనారాధన, నిత్య తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామివారికి పవళింపు సేవ నిర్వహించారు.