యాదాద్రి: జిమ్మీ(పిల్లి) నీవెక్కడమ్మా.. అంటూ ఓ కుటుంబం ఆందోళనలో పడింది. 10 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి న పెంపుడు పిల్లి కనిపించకపోవడంతో పిల్లలు స్కూల్ వెళ్లడం మానారు. కుటుంబ సభ్యులు అన్నం తినటం మానేశారు. ఇంట్లో కుటుంబ సభ్యుడు అదృశ్యమైతే మనోవేదనకు గురయ్యేంతగా వేదన చెందారు.
చేసేదేమీలేక పోలీస్ స్టేషన్ మెట్లె క్కారు. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమ పిల్లిని అపహరించారని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ అరుదైన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్ర వారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే మండలంలోని గౌరాయిపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల రాంచంద్రారెడ్డి కుటుంబం 7నెలల క్రితం పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో 2రోజుల వయస్సు గల తెల్ల రంగు, నల్ల చాయలున్న పిల్లిని తెచ్చి పెంచుకుంటున్నారు. పిల్లికి రోజుకు అరలీటర్ పాలు పడుతూ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి నిత్యం ఇంట్లో అందరితో చనువుగా ఉంటూ, ఉదయమే వారిని మేల్కొలుపుతూ ఉండేది. కుటుంబసభ్యుల మాటలను సైతం పసిగట్టి వారికి అనుకూలంగా నడుచుకునేది. ఈ క్రమంలో గత నెల 29వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లి తిరిగిరాలేదు.
పిల్లి పోయిందన్న విషయం తెలియడంతో పిల్లలు స్కూల్‌కు వెళ్లడం మానేశారు. కుటుంబ సభ్యులు 2 రోజులు నిద్రహా రాలు మాని బాధపడ్డారు. పిల్లికి తమతో విడదీయరాని బంధం ఉందని ఇప్పటికీ పిల్లిని మర్చిపోలేకపోతున్నామని గుజ్జు ల రామచంద్రారెడ్డి తెలిపారు. తమ కుమారులు జశ్వంత్‌రెడ్డి, తనీశ్రెడ్డిలు స్కూల్‌కు వెళ్లడం మానేశారని, అమ్మ గాల మ్మ రెండు రోజులుగా అన్నం తినడం లేదని విలపించారు.
9 రోజులగా చుట్టుపక్కల ఊర్లలో సైతం వెదికామని, గుర్తుతెలియని వ్యక్తులు తమ పిల్లిని అపరహరించిన్నట్లు అనుమా నాలు ఉన్నాయని తెలిపారు. వెంటనే అపహరించిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, పిల్లిని తమకు అప్ప గించాలని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు యాదగిరిగుట్ట పట్టణ సీఐ జానకిరెడ్డి తెలిపారు.