తుర్కపల్లి, జనవరి18 : మారుమూల తండాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులను ఏర్పాటు చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దయ్య బండ తండాలో మంగళవారం ఆమె నూతన రేషన్‌షాపును ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం దయ్యబండ తండాను కొత్త గ్రామ పంచాయతీగా మార్చడంతోపాటు తండాకు బీటీ రోడ్డును ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఈ తండావాసులు రేషన్ సరుకుల కోసం రెండు కిలో మీటర్ల దూరంలోని కోనాపురం వెళ్లేవారని, ఇప్పుడా సమస్య తీరిందని తెలిపారు.
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచ్ లలితాశ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, తాసీల్దార్ రవికుమార్, కోఆప్షన్ రహ్మత్షరీఫ్, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, మంగ్తా, నాయకులు యాకూబ్, వెంకటేశ్ పాల్గొన్నారు.