యాదాద్రి, అక్టోబర్ 29 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలోని బాలాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం అర్చకులు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. మరోవైపు బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ప్రధానాలయంలో స్వయంభువును కొలిచిన ఆచార్యులు బాలాలయ కవచమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు, శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనారసింహుడి సన్నిధిలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ.10,91,742 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 73,024
రూ.100 దర్శనం టిక్కెట్ 28,000
నిత్యకైంకర్యాలు 3,300
వేద ఆశీర్వచనం 4,644
క్యారీబ్యాగుల విక్రయం 4,000
టెంకాయల విక్రయం 1,000
వ్రత పూజలు 18,000
కల్యాణకట్ట టిక్కెట్లు 9,600
ప్రసాద విక్రయం 2,06,060
వాహన పూజలు 5,900
టోల్గేట్ 820
అన్నదాన విరాళం 7,883
సువర్ణ పుష్పార్చన 65,120
యాదరుషి నిలయం 40,130
పాతగుట్ట నుంచి 11,105
గోపూజ 550
ఇతర విభాగాలు 5,82,664