బీబీనగర్, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎంపీపీ సుధాకర్‌గౌడ్ అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోరుకంటి బాలచందర్, సూపరింటెండెంట్ శివకుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఘన నివాళి
చౌటుప్పల్ రూరల్ : మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, కౌన్సిలర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో పటేల్ సేవలను కొనియాడారు. అనంతరం జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్లు కొరగోని లింగస్వామి, ఆలె నాగరాజు, సుల్తాన్ రాజు, నాయకులు బాలకృష్ణగౌడ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
భువనగిరిలో ఐక్యతా ర్యాలీ
భువనగిరి అర్బన్ : వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్టాండ్ వరకు ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చంద మహేందర్‌గుప్త, నీలం రమేశ్, మున్సిపల్ ప్లోర్ లీడర్ మాయ దశరథ, కౌన్సిలర్లు రత్నపురం బలరాం, ఊదరి లక్ష్మి, జనగాం కవిత, నాయకులు బాల్‌రెడ్డి, భాస్కర్, లక్ష్మైనారాయణ, కపిల్, శ్రీశైలం, మహమ్మద్, నర్సింహ పాల్గొన్నారు.