న్యూఢిల్లీ, డిసెంబర్ 6: షియోమీ ఇండియా దేశీయ మార్కెట్లో రెడ్మీ సీరిస్‌లో భాగంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది షియోమీ ఇండియా. మూడు రకాల్లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్ రూ.12,499 నుంచి రూ.15,499 మధ్యలో లభించనున్నది.
17.53 సెంటీమీటర్ల హెచ్డీ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్‌ఫోనలో 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియా టెక్ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌ను పెంచుకునే వీలుంటుంది. కేవలం 28 నిమిషాల్లోనే ఈ మొబైల్ బ్యాటరీ సగం రీచార్జికానున్నది.