దోహా: డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టేబుల్‌టెన్నిస్ (టీటీ) టోర్నీలో భారత జోడీ మనికా బాత్రా- అర్చనా కామత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. దోహా వేదికగా మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక-అర్చన జోడీ 3-1 (13-11, 8-11, 11-5, 13-11)తో సోవేయామ్ మిన్ని-లీ హోచింగ్ (హాంకాంగ్) ద్వయాన్ని చిత్తు చేసింది. తొలి గేమ్‌లో ఆధిక్యం కనబర్చిన మన జోడీ రెండో గేమ్‌ను కోల్పోయింది. అనంతరం వరుసగా రెండు గేమ్‌ల్లో ఆధిక్యంతో మ్యాచ్‌ను చేజిక్కించుకున్న మనిక జోడీ ముందంజ వేసింది. సెమీస్ పోరులో లియు ఝున్-చెంగ్ఐ చింగ్ జోడీతో భారత జంట అమీతుమీ తేల్చుకోనుంది. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక-సాతియాన్, పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్-మానవ్ వికాస్ జోడీలు నిరాశపర్చాయి.