కడ్తాల్ : పాకిస్థాన్‌తో ( Pakistan) జరుగుతున్న పోరులో భారత సైన్యం ( Indian Army ) గెలుపొందాలని, ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor ) విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు మైసమ్మ ఆలయంలో అమ్మ వారికి అభిషేకం( Abhishekam ) , అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.
యుద్ధంలో దాయాది దేశం పాకిస్తాన్ తగిన గుణపాఠం చెప్పాలని, ధర్మా పోరాటానికి అమ్మ వారు అండగా ఉండాలని భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, చంద్రయ్య, రాములు, కృష్ణగౌడ్, శ్రీనివాస్, విజయ్‌గౌడ్, బాలబ్రహ్మాచారి, శ్రవణ్, అర్చకులు భానుప్రకాశ్శర్మ, సంతోశ్, ఆనంద్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.