న్యూఢిల్లీ, మార్చి 18: ప్రపంచంలో మొట్టమొదటిసారి పూర్తిగా కృత్రిమ మేధతో(ఏఐ) వార్తాపత్రికను ప్రచురించినట్ట్టు ఓ ఇటాలియన్ వార్తా సంస్థ మంగళవారం ప్రకటించింది. ఏఐ టెక్నాలజీ ప్రభావం జర్నలిస్టులు, పత్రికల పనితీరుపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఒక నెలరోజులపాటు ప్రయోగాత్మకంగా పూర్తి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దినపత్రికను రూపొందించినట్టు ఫాగియో వార్తాపత్రిక డైరెక్టర్ కలాడియో సెరాసా తెలిపారు.
ఏఐ టెక్నాలజీతో తయారైన నాలుగు పేజీల ఎడిషన్ మంగళవారం మార్కెట్‌తోపాటు ఆన్లైన్లో కూడా విడుదలైంది. భవిష్యత్తులో జర్నలిస్టుల పాత్ర చాలా పరిమితం కానున్నట్టు ఆయన తెలిపారు. పత్రికా పరిశ్రమలో ఏఐని ఏ విధంగా ఉపయోగించాలని ప్రపంచవ్యాప్తంగా వార్తా సంస్థలు ఆలోచిస్తున్న సమయంలో ఇటాలియన్ వార్తాపత్రిక ఈ ప్రయోగం చేసింది.