Tokyo Olympics : క్వార్టర్ ఫైనల్‌కు వినేష్ ఫోగట్
వినేష్ ఫొగట్ | టోక్యో ఒలిపింక్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శుభారంభం చేసింది. 53 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్ సోఫియాను 7-1 తేడాతో మట్టికరిపించింది. వినేశ్ మ్యాచులో ప్రత్యర్థిపై ఆది నుంచి ఆధిపత్యం చలాయించింది.

టోక్యో : టోక్యో ఒలిపింక్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ వినేశ్ ఫోగట్ శుభారంభం చేసింది. 53 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్ సోఫియాను 7-1 తేడాతో మట్టికరిపించింది. వినేశ్ ఫోగట్ మ్యాచులో ప్రత్యర్థిపై ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి పిరియడ్‌లో 2, 2, 1 స్కోరు సాధించిన ఆమె రెండో పిరియడ్‌లో స్కోరు 2 మాత్రమే సాధించింది. ప్రత్యర్థి మాట్సన్ కేవలం ఒకే పాయింట్ సరిపెట్టుకున్నది. తరువాతి మ్యాచ్‌లో వినేశ్ బెలారస్‌కు చెందిన వనేసా కలడ్జింసక్యాతో తలపడనుంది. మరో రెజ్లర్ అన్షు మాలిక్ మహిళల 57 కేజీల విభాగంలో రీపేజ్ రౌండ్లో ఓడిపోయింది. రష్యాకు చెందిన రెజ్లర్ వలెరియా చేతిలో 1-5 తేడాతో అన్షు ఓటమిపాలైంది. అన్షు మంచి డిఫెన్స్ చూపించినప్పటికీ పరాజయం తప్పలేదు. మరో వైపు కాంస్య పతకం కోసం పురుషుల హాకీ జట్టు జర్మనీతో తలపడుతున్నది. 5-3 గోల్స్ తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
ఇవి కూడా చదవండి
Nose Hair : ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
ఈ ఒక్క అలవాటుతో ఎక్కువ కాలం బతికేస్తారు!
రూ.686 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Pulichintala : ఊడిన పులిచింతల డ్యామ్ గేట్.. నీరంతా వృథా
Women’s Hokey team : మహిళల హాకీ టీంకు సూరత్ వజ్రాల వ్యాపారి బంఫర్ ఆఫర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

