ఈ ఒక్క అలవాటుతో ఎక్కువ కాలం బతికేస్తారు!

న్యూఢిల్లీ : దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవించాలని కోరుకోని వారుండరు. అయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు ఎలాంటి రహస్య ఫార్ములాలు లేవు. దీర్ఘాయువుతో సుఖంగా బతికేయాలంటే కొన్ని ఆరోగ్యకర అలవాట్లు ఉపకరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒకేఒక్క జీవనశైలి మార్పుతో దీర్ఘాయువు సాధ్యమని జర్నల్ ఫ్రంటియార్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. రోజువారీ నిద్రించే పద్ధతులతో దీర్ఘాయువుకు సంబంధం ఉందని ఈ పరిశోధనా పత్రం వెల్లడించింది.
ఎక్కువ కాలం జీవించిన వారిలో ఇతరులతో పోలిస్తే రోజూ సరైన సమయంలో వారు నిద్రకు ఉపక్రమిస్తారని, వీరిలో లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్ స్ధాయిలు) సరైన రీతిలో ఉంటుందని గుర్తించారు. రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు గాఢనిద్ర, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకుంటే మానవులు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని ఈ పరిశోధనలో వెల్లడైంది.
రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించడం, ఒకే సమయంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రించే ముందు పొగతాగడం, మద్యపానం, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. బెడ్రూమ్లో అన్ని డిజిటల్ తెరలను రాత్రి సమయంలో పక్కనపెట్టాలి. ఒత్తిడికి దూరంగా ఉండటంతో పాటు రోజుకు 30 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేస్తే సుఖనిద్ర సొంతమవుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

