లిస్బన్: కరోనా కారణంగా ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసే విధానం ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే, పని వేళలు ముగిశాక కూడా.. తమ బాస్‌లు అదేపనిగా ఫోన్, మెసేజ్ చేస్తూ విసిగిస్తున్నారంటూ పలు ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తుండటం తెలిసిందే. ఆఫీస్ సమయం మొదలుకాక ముందు లేదా ముగిసిన తర్వాత ఉద్యోగులను డిస్టర్బ్ చేస్తే ఆ కంపెనీ యజమానులకు జరిమానా విధించే కొత్త కార్మిక చట్టాన్ని ఐరోపా దేశం పోర్చుగల్ తాజాగా అమల్లోకి తెచ్చింది.
స్టాఫ్‌పై పర్యవేక్షణ అధికారాన్ని కూడా తొలగిస్తామని బాస్‌లను హెచ్చరించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో వేళాపాలా లేకుండా బాస్‌లు విసిగిస్తున్నారని, దీంతో మానసిక వేదనకు గురవుతున్నట్టు ఉద్యోగులు పెద్దఎత్తున విజ్ఞప్తులు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే పది మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ఈ నిబంధనలు వర్తించబోవన్నారు.