లండన్: కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి ఫేస్ మాస్క్ తప్పనిసరైంది. అయితే, చాలామంది మాస్కు పెట్టుకునేందుకు బద్ధకిస్తున్నారు. కాగా, లండన్లోని ఓ దుకాణానికి మాస్కులేకుండా వచ్చిన మహిళను సెక్యూరిటీగార్డులు అడ్డుకోగా, ఆమె వారిపై ఉమ్మేసింది. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యింది.
దుకాణానికి ఓ మహిళ మాస్కు లేకుండా వచ్చింది. సెక్యూరిటీ గార్డులు ఆమెను లోనికి అనుమతించలేదు. ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆమెతోపాటు ఉన్న మహిళలు కూడా సెక్యూరిటీగార్డుతో గొడవకు దిగారు. అనంతరం ఓ మహిళ అసభ్యకర పదజాలంతో వారిని దూషించింది. సెక్యూరిటీగార్డుపై ఉమ్మేసింది. అక్కడే ఉన్నవారు ఇదంతా ఫోన్లో చిత్రీకరించారు. పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేశారు.