RTC Conductor | కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’.. భద్రాద్రి జిల్లాలో దారుణం
RTC Conductor | చిల్లర విషయంలో ప్రయాణికురాలు, కండక్టర్‌కు మధ్య జరిగిన వివాదంలో మహిళా కండక్టర్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది.
RTC Conductor | అశ్వాపురం/ హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) అక్టోబర్ 25: చిల్లర విషయంలో ప్రయాణికురాలు, కండక్టర్‌కు మధ్య జరిగిన వివాదంలో మహిళా కండక్టర్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. అశ్వాపురం సీఐ ఎల్లయ్య కథనం ప్ర కారం.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తు న్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మౌనిక అనే ప్రయాణికురాలు తన కుమారుడితో కలిసి ఎక్కింది.
అశ్వాపురం మండలం మిట్టగూడెం లో దిగేందుకు తన కుమారుడికి హాఫ్ టికెట్ ఇవ్వాలంటూ కండక్టర్ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చింది. చిల్లర విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో ప్రయాణికురాలిపై అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కండక్టర్ భావించింది. ఈ మేరకు మిట్టగూడెం స్టాప్‌లో ప్రయాణికురాలిని బస్సు దిగనివ్వకుండా కండక్టర్ డోరు వద్ద నిలువరించింది. బస్‌స్టాప్ దాటిపోతుండటంతో మహిళా కండక్టర్‌ను సదరు ప్రయాణికులు నెట్టివేసింది.
దీంతో కండక్టర్.. బస్సు డోర్ నుంచి రోడ్డుపై పడిపోగా ఆమె కుడి కాలు పైనుంచి బస్సు వెనుక టైర్లు ఎక్కడంతో కాలు నుజ్జునుజ్జయింది. ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు, తోటి ప్రయాణిలు స్పందించి 108 అంబులెన్స్ ద్వారా కండక్టర్‌ను భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు. అశ్వాపు రం పోలీసులు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. మణుగూరు డీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు అశ్వాపురం సీఐ ఎల్లయ్య తెలిపారు.
కండక్టర్‌కు మెరుగైన వైద్యం అందించండి
మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికపై జరిగిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్‌పై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదుచేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కండక్టర్ ప్రవళికకు మెరుగైన చికిత్స అందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
విధుల్లో ఉన్న సిబ్బందితో ప్రయాణికులు సహృదయంతో వ్యవహరించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమస్యల పరిషారానికి దాడులు చేయడం పద్ధతి కాదని స్పష్టం చేశారు. మహిళాకండక్టర్పై దాడిని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈదురు వెంకన్న, థామస్‌రెడ్డి, కమల్‌రెడ్డి, నరేదందర్, హనుమంతు ముదిరాజ్, వీఎస్‌రావు తదితరులు తీవ్రంగా ఖండించారు. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductor | కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’.. భద్రాద్రి జిల్లాలో దారుణం
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

