సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?
రాష్ట్ర ప్రభుత్వ కీలక వెబ్సైట్లు, వాటి సర్వర్లకు భద్రత లేకుండా పోయింది. వాటిపై యథేచ్ఛగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పోలీస్ వెబ్సైట్, హైకోర్టు వెబ్సైట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘ఎక్స్' ఖాతాపై దాడులు జరిగాయి. తాజాగా ఇప్పుడు టీజీ-ఐపాస్ వెబ్సైట్ ఈ జాబితాలో చేరింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున అనుమతులు ఇచ్చే అత్యంత కీలకమైన ఈ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
- రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
- నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సర్కార్
- తాజాగా టీజీ-ఐపాస్ సర్వర్‌పై సైబర్ దాడి
- డాటాబేస్తోపాటు పలు ఇతర ఫైళ్ల ఎన్క్రిప్షన్
- dataleaks 5కు మెయిల్ చేయాలన్న కేటుగాళ్లు
- సీఎస్‌బీకి పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఫిర్యాదు
- సమస్యను తాత్కాలికంగా పరిష్కరించిన సీఎస్బీ
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ కీలక వెబ్సైట్లు, వాటి సర్వర్లకు భద్రత లేకుండా పోయింది. వాటిపై యథేచ్ఛగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పోలీస్ వెబ్సైట్, హైకోర్టు వెబ్సైట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘ఎక్స్’ ఖాతాపై దాడులు జరిగాయి. తాజాగా ఇప్పుడు టీజీ-ఐపాస్ వెబ్సైట్ ఈ జాబితాలో చేరింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున అనుమతులు ఇచ్చే అత్యంత కీలకమైన ఈ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
దాని సర్వర్, డాటాబేస్, ఇతర ఫైళ్లను వారి స్వాధీనంలోకి తీసుకొని ఎన్‌క్రిప్ట్ చేశారు. తద్వారా మన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థకు పెద్ద సవాల్ విసిరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. నిత్యం ప్రతిపక్షాలపై బురదజల్లే రాజకీయాల్లో ప్రభుత్వం నిమగ్నం అవడంతో సైబర్ దాడులకు తెలంగాణ అడ్డాగా మారింది. తద్వారా రాష్ట్రం నుంచి సైబర్ నేరగాళ్లు రోజుకు రూ.5 కోట్ల మేర కొల్లగొడుతున్నా కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దీంతో కేటుగాళ్లు అడ్డూ అదుపూ లేకుండా ప్రభుత్వ వ్యవస్థల వెబ్సైట్లలోకి చొరబడి, డాటాను దొంగిలిస్తున్నారు. ఆ సమాచారాన్ని డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే..
సైబర్ దాడితో టీజీ-ఐపాస్ పోర్టల్ నిర్వహణకు సంబంధించిన అప్లికేషన్, డేటాబేస్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఆ పోర్టల్‌లోని డాటా, ఇతర ఫైళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎన్‌క్రిప్ట్ చేశారు. ఆ ఫైళ్లకు ‘.vgb’ అనే కొత్త ఎక్స్‌టెన్షన్‌ను తగిలించారు. ఎన్క్రిప్షన్ నుంచి ఆ ఫైళ్లకు విముక్తి కల్పించాలంటే ‘vg 2abe240 ecdeddd5d6’ అనే మెషీన్ ఐడీ నుంచి ‘dataleaks5 @gmail. com’కు మెయిల్ చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 22 రాత్రి 11.36 గంటల సమయంలో టీజీ-ఐపాస్ అప్లికేషన్ అందుబాటులో లేకుండా పోయింది.
అదే సమయంలో దాని డాటాబేస్ సర్వర్‌కు కూడా సాంకేతిక బృందం కనెక్ట్ కాలేకపోయింది. టీజీ-ఐపాస్‌కు సర్వర్ వసతులను అందిస్తున్న ‘క్లౌడ్ 4సీ’ సంస్థను సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదు. అనంతరం SQL Server Agent సేవ కూడా నిలిచిపోయింది. దీనిపై లోతుగా పరిశీలించడంతో సర్వర్ వ్యవస్థపై ర్యాన్సమ్వేర్ లాంటి సైబర్ అటాక్ జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. ఈ దాడి వల్ల దరఖాస్తుల సమర్పణ, పరిశీలన తదితర సేవలపై ప్రభావం పడింది. మొత్తంగా దరఖాస్తులు నిలిచిపోయాయి? ఎంతమంది పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది తెలియాల్సి ఉన్నది.
తాత్కాలికంగా సమస్య పరిష్కారం
ఈ దాడిపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సంగ సురేశ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. సైబర్ దాడి మరింత విస్తరించకుండా నిరోధించేందుకు ప్రభావిత సర్వర్లు, వ్యవస్థలను వెంటనే గుర్తించి, అవసరమైన ఐసోలేషన్ చర్యలు చేపట్టాలని, డిజిటల్ ఆధారాల పరిరక్షణ కోసం సర్వర్ లాగ్‌లు, డిస్ ఇమేజ్‌లు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని టీజీ-ఐపాస్ అధికారులు సీఎస్‌బీని కోరారు.
దాడి ఏ మార్గంలో జరిగిందో, వ్యవస్థలు ఎంత మేరకు ప్రభావితమయ్యా యో గుర్తించేందుకు ఫోరెన్సిక్ దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తమ సిబ్బందిని రంగంలోకి దించి, సమస్యను తాత్కాలికంగా పరిష్కరించామని, డాటా ఆధారంగా టీజీ-ఐపాస్ అప్లికేషన్, డాటాబేస్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని, పాస్వర్డ్లతోపాటు యాక్సెస్‌ను మార్చివేసి భద్రతాపరమైన పర్యవేక్షణ పెంచామని సీఎస్బీ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నిరోధించేందుకు టీజీ-ఐపాస్ వెబ్సైట్, అప్లికేషన్‌పై నిఘా పెట్టినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

