‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు!
దసరావేళ అన్ని వర్గాలనూ లూటీ చేసిన ఆర్టీసీ.. ‘స్పెషల్ బస్' బోర్డులు లేకుండానే స్పెషల్ చార్జీలు.. జర్నలిస్టులకు వర్తించని 1/3
- డీలక్స్లలో ఎక్స్‌ప్రెస్ ప్రయాణం.. వర్తించని మహాలక్ష్మి
- బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పే మాటలకు, చేసే ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దసరా పండుగకు 7 వేలకుపైగా స్పెషల్ బస్సులు వేశామని చెప్పిన ఆయన.. ఆ బస్సులకు కచ్చితంగా ‘దసరా స్పెషల్’ ‘స్పెషల్ సర్వీసు’ ‘స్పెషల్ బస్సు’ అని బోర్డులు పెట్టాలని ఆదేశించారు. అలా ‘స్పెషల్’ అని రాసిన బస్సుల్లోనే 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేయాలని చెప్పారు.
అయితే, ఆ నిబంధనలను రీజినల్, డిపో మేనేజర్లు తుంగలో తొక్కారు. రెగ్యులర్ సర్వీసులను కూడా స్పెషల్‌గా మార్చి డబ్బులు దండుకున్నారు. ఆయా డిపోల్లో రద్దీని బట్టి ఎలాంటి బోర్డులు లేకుండా పాయింట్లో పెట్టడం.. ఆ బస్సు కదిలిన తర్వాత స్పెషల్ ఫేర్ చెప్పి అదనంగా దండుకోవడం పరిపాటిగా కనిపించింది. ఈ దసరాకు స్పెషల్ బస్సులు ప్రారంభమైన నాటినుంచీ అదే తీరు కనిపించినా.. ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
కనిపించని మహాలక్ష్మి ఉచిత బస్సులు
బస్సులకు ‘స్పెషల్ బస్సు’ బోర్డులు లేకుండా స్పెషల్ ఫేర్ వసూలు చేయడంపై పలువురు ప్రయాణికులు ప్రశ్నించడంతో ‘మాకు డిపో మేనేజర్ల నుంచి ఆదేశాలు లేవు. వారి దగ్గర పేపర్లు కూడా లేవు. మా టిమ్‌లలో స్పెషల్ ఫేర్ ఫీడ్ చేసి ఇచ్చారు. మేమేం చేసేది’ అంటూ ఆర్టీసీ సిబ్బంది దురుసుగా సమాధానం ఇస్తున్నారు. కనీసం తెల్లకాగితం మీద ‘స్పెషల్ సర్వీసు’ అని రాయలేని దుస్థితిలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పండుగ సమయంలో రద్దీని ‘క్యాష్’ చేసుకునేందుకు ఆయా డిపోల్లో మేనేజర్లు రెగ్యులర్ సర్వీసులను పక్కనపెట్టి.. స్పెషల్ బస్సులను తిప్పారు. దీంతో స్పెషల్ బస్సులకు డబ్బులు ధారపోయలేక, రెగ్యులర్ బస్సుల కోసం గంటల తరబడి పిల్లలతోపాటు చాలామంది ఎదురుచూశారు. బస్సు ఎకేవరకు సాధారణ సర్వీసా? ప్రత్యేక సర్వీసా? అనే స్పష్టత లేకపోవడం, ఎకిన తర్వాత అధిక చార్జీలు చెల్లించాల్సి రావడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.
కాగా, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు వంటి స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. అయితే, ఆ బస్సులు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. వాటి కోసం బస్ స్టేషన్లు, డిపోల్లో పడిగాపులు కాశారు. డీలక్స్ సర్వీసుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు అంటూ బోర్డులు పెట్టిన అధికారులు.. ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయలేదు. దీంతో మహిళా ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జర్నలిస్టులకు వర్తించని 1/3 ఫేర్..
ఈ దసరా పండుగ వేళ అన్నివర్గాల ప్రజలతో పాటు.. జర్నలిస్టుల నుంచి కూడా ఆర్టీసీ భారీగా దండుకున్నది. గతంలో పండుగల వేళ స్పెషల్ బస్సుల్లో సైతం 1/3 ఫేర్ వసూలు చేసే అధికారులు ఈసారి పూర్తిగా ఆ నిబంధనను ఎత్తివేశారు. కొన్ని రెగ్యులర్ సర్వీసులు మినహా.. సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు వంటి స్పెషల్ బస్సుల్లో 1/3 ఫేర్‌ను తీసేశారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఇచ్చే టిమ్‌లలో 1/3 ఫేర్ ఆప్షన్ లేకుండా చేశారు.
టిమ్‌లో ఉండే ఆల్ కేటగిరీస్‌లో లగేజ్, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్సీ, పోలీస్ వారెంట్, రిటైర్డ్ ఎంప్లాయీ స్పౌజ్, స్టాఫ్ వారెంట్ ఆఫీసర్ వంటి కేటగిరీలే ఉన్నాయి తప్ప.. జర్నలిస్టు 1/3 అనే ఆప్షనే లేదు. దీంతో సాధారణ చార్జీలు కాకుండా అదనపు చార్జీలతో పండుగకు ప్రయాణం చేయాల్సి వచ్చిందని పలువురు జర్నలిస్టులు వాపోయారు. ‘ప్రతి యేటా పండుగలకు వచ్చే స్పెషల్ బస్సుల్లో ఇచ్చే 1/3 ఫేర్ ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు?’ అని ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారులే టిమ్‌లో 1/3 ఫేర్ ఎంటర్ చేయలేదని సమాధానం ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

