న్యూఢిల్లీ : పేస్బుక్ వేదికగా మహిళకు పరిచయమై బాయ్‌ఫ్రెండ్‌గా మారిన వ్యక్తి ఆమె కష్టార్జితాన్ని(Cyber Fraud) దోచుకున్నాడు. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన మహిళను నిలువునా మోసగించాడు. గత ఏడాది అక్టోబర్‌లో తనకు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో మహిళ సన్నిహితంగా మెలిగింది.
తన పేరును అలిస్గా పరిచయం చేసుకుని ఫేస్బుక్ బాయ్‌ఫ్రెండ్‌తో మహిళ చాట్ చేసింది. ఆ వ్యక్తి నిజాయితీపరుడని, అర్ధవంతమైన సంబంధం కోసం చూస్తున్నాడని మహిళ భావించింది. వీరిద్దరూ పలుమార్లు వీడియో కాల్స్‌లో కూడా మాట్లాడుకోవడంతో అతడిని పూర్తిగా నమ్మింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిందితుడు పలు కారణాలతో అలిస్ను డబ్బు పంపాలని కోరాడు.
పలుమార్లు ఆమె నిందితుడి బ్యాంక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. అలిస్ను చూసేందుకు అమెరికా రావాల్సి ఉండగా తను రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్నానని నిందితుడు చెప్పడంతో ఆమెకు మోసపోయాననే అనుమానం కలిగింది. ఆ సమయంలో తాను మోసపోయానని గ్రహించానని అలిస్ వాపోయింది.
Read More :
Startup | మీ ఇన్వెస్టర్ల ఆర్థిక స్థోమతను వెల్లడించండి.. స్టార్టప్‌లకు ఐటీ శాఖ నోటీసులు