పూణె: స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ ఉండగా లోయలో పడిన మహిళను(29) స్థానికులు రక్షించిన ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్నే ఘాట్లో శనివారం జరిగింది. 100 అడుగులు ఉన్న లోయలో నుంచి ఆమెను స్థానికులు, హోం గార్డులు తాడు సాయంతో రక్షించి స్థానిక దవాఖానకు తరలించారు.