కోల్కతా: 20 ఏండ్ల యువతిపై ఇద్దరు పరిచయస్థులు ఆమె పుట్టిన రోజు నాడు కోల్కతాలోని సంపన్న వర్గాలుండే రీజెంట్ పార్క్ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. ఘటన తర్వాత ఇద్దరు నిందితులు పరారయ్యారు. నిందితులను చందన్ మాలిక్, దీప్గా గుర్తించారు.
దీప్ ప్రభుత్వ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. బాధితురాలి పుట్టిన రోజు వేడుకను జరపడానికి శుక్రవారం చందన్ ఆమెను దీప్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ వారు భోజనం చేశాక ఆమె ఇంటికి తిరిగి వెళతానని కోరినప్పుడు నిందితులు ఆమెను ఆపి తలుపుకు తాళం వేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.