న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత పొడవైన మెరుపుగా 2017 అక్టోబరులో మెరిసిన మెరుపు రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలోని గ్రేట్ ప్లెయిన్స్ వెంబడి టెక్సాస్ నుంచి కాన్సాస్ వరకు 829 కి.మీ. (515 మైళ్లు) పొడవున ఈ మెరుపు వెలుగులు విరజిమ్మింది. వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) గురువారం ఈ రికార్డును ప్రకటించింది.
పరిశోధకులు జీఓఈఎస్ ఈస్ట్ వెదర్ ఉపగ్రహం డేటాను ఉపయోగించి దీనిని గుర్తించారు. దీనిని మెగాఫ్లాష్ లైటనింగ్ అని పిలుస్తున్నట్లు డబ్ల్యూఎంఓ జాగ్రఫికల్ సైంటిస్ట్ రాండీ సెర్వెనీ చెప్పారు. 2020 ఏప్రిల్ 29న 768 కి.మీ. పొడవైన మెరుపు మెరిసిందని, ఈ రికార్డును ఇది చెరిపేసిందని ఆయన తెలిపారు.