యువ హీరో విశ్వక్ సేన్ హైదరాబాద్‌లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు అశ్వథ్థ్, రచయిత ప్రసన్న, నటుడు హైపర్ ఆది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ తను నటిస్తున్న రెండు కొత్త చిత్రాలను ప్రకటించారు. ‘ఫలక్‌నుమాదాస్ 2’, ‘స్టూడెంట్ జిందాబాద్’ పేరుతో ఈ సినిమాలు ఉంటాయని తెలిపారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ…‘ఈ ఏడాది నాకు ప్రత్యేకంగా ఉండబోతున్నది. వేటికవి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నాను. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా అలరిస్తుంది. ‘దాస్ కా ధమ్కీ’ మాస్ సినిమా. ‘ఓరి దేవుడా’ మంచి ఎంటర్టైనర్. ఇందులో దేవుడి పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తున్నారు. త్వరలో స్టూడెంట్ లీడర్ పాత్రలో ‘స్టూడెంట్ జిందాబాద్’ అనే చిత్రంలో నటిస్తున్నా. దీంతో పాటు నాకు పేరు తెచ్చిన ఫలక్‌నుమా దాస్ చిత్రానికి సీక్వెల్ కూడా జాబితాలో ఉంది’ అన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ గురించి ఓ ప్రత్యేక పాటను విడుదల చేశారు.