మనిషికి రోగాన్ని బట్టి చికిత్స చేసినట్టే.. మొక్కలకూ కాలాన్నిబట్టి వైద్యం చేయాలంటారు. లేకపోతే ఫలదీకరణ ఉండదు. అకారణంగా ఎండిపోతాయి. చలికాలంలో మొక్కల సంరక్షణ ఎలా ఉండాలంటే..
2
చలికాలంలో సూర్యరశ్మి తక్కువ. కాబట్టి మొక్కలు తక్కువ నీటిని పీల్చుకుంటాయి. ఆ మేరకే నీళ్లు పెట్టాలి.
నీరుపోసే ముందు నేల పొడిబారిపోయి ఉందా, తేమగా ఉందా? అనేది చూసుకోవాలి. దీనివల్ల నీరుచిచ్చు సమస్య తగ్గించుకోవచ్చు.
చలిగాలి ఇంట్లో మొక్కలకు తాకకుండా చూడాలి. కుండీలను కిటికీలకు దూరంగా ఉంచాలి. లేకపోతే గాలికి ఆకులు ముడుచుకుపోతాయి.
నీరు పోయే ఏర్పాటు ఉన్న కుండీలను మాత్రమే ఉపయోగించాలి.
స్వీట్ అలిస్సమ్, పెటునియా, పాన్సీ, పీస్లిల్లీ, సాన్సేవిరియా వంటి రకాలను ఈ సీజన్లో ఎంచుకోవచ్చు. ఇవి గాలిని శుద్ధి చేస్తాయి.
ఎందుకైనా మంచిది సేంద్రియ క్రిమి సంహారకాలనూ సిద్ధంగా ఉంచుకోండి.