హనుమకొండ చౌరస్తా : క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రయత్నిస్తే సాధించ లేనిది ఉండదని ఆర్యవైశ్య సత్రం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేష్‌బాబు ( Gattu Mahesh Babu ) అన్నారు. హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ( State Level Athlets ) ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గట్టు మహేష్‌బాబు, గట్టు అరవింద్ విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. అనంతరం గట్టు మహేష్‌బాబు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఓరుగల్లు ఖిల్లా పుట్టినిల్లు లాంటిదని, పోరాటాలగడ్డ ఓరుగల్లు నుంచి ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి అథ్లెట్లు విశ్వవేదికలపై తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించారన్నారు.

క్రీడల్లో క్రమశిక్షణ, కఠోర సాధన చేసినప్పుడు అనుకున్న లక్ష్యంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, టెక్నికల్ కమిటీ చైర్మన్ జగన్, సెలక్షన్ కమిటీ చైర్మన్ పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్‌లు నాగరాజు, శ్రీమన్నారాయణ, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు.