హైదరాబాద్, ఆట ప్రతినిధి: రషీద్‌ఖాన్ స్మారక ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్‌సీ విజేతగా నిలిచింది. గోల్కోండ పూర్వ విద్యార్థుల క్రీడా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్లో గోల్కోండ ఎఫ్‌సీ 1-0తో సీసీఓబీపై విజయం సాధించింది. మహమ్మద్ ఎతేషామ్ అలీ ఐదో నిమిషంలో చేసిన ఏకైక గోల్‌తో జట్టు చాంపియన్‌గా నిలువగా.. ప్రత్యర్థి జట్టు స్కోర్ ఖాతా తెరవకుండానే రన్నరప్‌గా సరిపెట్టుకుంది. విజేతలకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ట్రోఫీ అందించి అభినందించారు. టోర్నీలో గోల్స్‌తో విజృంభించిన ఎతేషామ్కు ‘గోల్డెన్ బూట్’ అవార్డు దక్కింది.