రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ ఆల్‌రౌండర్
అబుదాబి: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019లో రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకున్న బ్రావో.. టీ20 ప్రపంచకప్‌తో కెరీర్‌ను ముగిస్తున్నట్లు స్పష్టంచేశాడు. 2004లో అరంగేట్రం చేసిన బ్రావో.. విండీస్ తరఫున 7 టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు. 2012, 2016లో కరీబియన్లు ట్రోఫీ నెగ్గడంలో బ్రావో కీలక పాత్ర పోషించాడు. విండీస్ తరఫున 90 టీ20లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 1245 పరుగులు చేయడంతో పాటు 78 వికెట్లు పడగొట్టాడు. 40 టెస్టులు, 164 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడిగా చిరపరిచితుడే. నేడు ఆసీస్‌తో జరుగనున్న మ్యాచ్ బ్రావోకు చివరిది కానుంది.