హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒరిగేది ఏం లేదని గెల్లు శ్రీనివాస్ కు ఒక్క అవకాశం ఇస్తే హుజూరాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తామని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి హుజూరాబాద్ లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసినవో చెప్పవు. గెలిస్తే ఏం చేస్తవో చెప్పవు కానీ తిట్ల పురాణం మొదలు పెడుతున్నవు.అని ఈటలను ఉద్ధేశించి అన్నారు.
దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న పార్టీ టీఆర్ఎస్ అని ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్న ప్రభు త్వం బీజేపీ ప్రభుత్వమని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పి ఓట్లు అడగండి అంతేకానీ అబద్ధాలతో ఓట్లు పడవని ఆయన హితవు పలికారు. కేంద్ర మంత్రులు ఉత్త చేతులతో వచ్చి ప్రచారం చే్స్తున్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ పట్టణంలో 60 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుందని తెలిపారు.
గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే పదిహేను రోజులకొకసారి వచ్చి అభివృద్ధిని కొనసాగిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు ఢిల్లీలో బలముందని పోలీస్ బలగాలను దించుతా అంటే ఓట్లు పడవని, ప్రజల మనసు గెలిస్తేనే ఓట్లు పడుతాయన్నారు. అంతిమంగా గెలిచేది టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తేనని ఆయన స్పష్టం చేశారు.
గెల్లును గెలిపించండి అభివృద్ధికి అండగా ఉండండి : మంత్రి గంగుల
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్, తెలంగాణను అభివృద్ది చేస్తున్న పార్టీ టీఆర్ఎస్, తెలంగాణలో ఓట్లడిగే అర్హత ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర బీసీ సంక్షేమ ఫౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.హుజురాబాద్ నగరంలో నిర్వహించిన దూందాం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పెద్దిరెడ్డి ఇతర సీనియర్ నేతలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడుసంవత్సరాలు మంత్రిగా పనిచేసి సైతం హుజురాబాద్‌ను అభివృద్ధి చేయలేని వ్యక్తి రేపు ప్రతిపక్షంలో ఉండి ఏం చేయగలడో ఆలోచించాలి, ఈటల వల్ల హుజురాబాద్ బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా పోయా యని, అభివృద్ధి కుంటుపడిందన్నారు, ఒకనాడు కరెంటు రాక, నీళ్లు లేక అనేక అవస్థలు పడ్డామని వాటన్నింటిని రూపుమాపేందుకే కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ సాధించారన్నారు.
కళ్యాణలక్ష్మీ, రైతుబందు, రైతుబీమా ఉచిత 24గంటల కరెంటు వంటి అనేక రకాల సంక్షేమ పథకాలతో తెలంగాణ సుభీక్షంగా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ పెంచుతున్న ఇందన ధరలతో సామాన్యుడు ఎలా కుదేలవుతున్నాడో అర్థం చేసుకోవాలన్నారు. అందర్నీ ఆందోళనకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపైతే, అభివృద్ధి, సంక్షేమాన్ని అంది స్తున్న పార్టీ టీఆర్ఎస్ అని, హుజురాబాద్‌లో అభివృద్ధికి పట్టం కట్టి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.