
కాఠ్మాండు, నవంబర్ 26: నేపాల్‌లో తాము తిరిగి అధికారంలోకి వస్తే భారత్ నుంచి కాలాపాని, లింపియాధుర, లిపులేఖ్ భూభాగాలను భారత్ నుంచి తిరిగి తీసుకుంటామని ఆ దేశ మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్షం సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓటీ శుక్రవారం పేర్కొన్నారు. ఈ మేరకు భారత్‌తో చర్చలు జరుతామని అన్నారు. కాఠ్మాండులో సీపీఎన్-యూఎంఎల్ పార్టీ 10వ జనరల్ కన్వెన్షన్‌ను ప్రారంభిస్తూ ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు.