PM Kisan | హుజూరాబాద్, జూన్ 11 : వ్యవసాయంలో రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో పంట పెట్టబడి సాయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10మే 2018న రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. కాగా దీనిననుసరించి కేంద్రప్రభుత్వం రైతులకు పెట్టుబడి కింద డిసెంబర్ 2018న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభించింది. అయితే రైతుబంధు పథకానికి కిషాన్ సమ్మాన్ యోజన పథకం నక్కకు నాగలోకానికి తేడా లాగా ఉంది.
రైతుబందు పథకం అమలైనప్పటినుంచి కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు కూడా ఈ పథకం వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ వస్తుండగా కేంద్రం మాత్రం పథకం ప్రారంభమైనా తర్వాత దరఖాస్తుకు ఇచ్చిన అవకాశమే కాగా మళ్లీ ఇప్పటివరకు కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు ఇవ్వలేదు.
మళ్లీ అవకాశం వచ్చేదెన్నడో..?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం దరఖాస్తుకు మళ్లీ అవకాశమెప్పుడని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుబందు పథకం దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతియోట ఆగస్టు, డిసెంబర్ లో కొత్తగా పట్టేదారు పాసుబుక్కులను పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తుండగా కేంద్రప్రభుత్వం మాత్రం పథకం ప్రారంభమైనా తర్వాత ఇచ్చిన అవకాశమే కాగా మరోసారి రైతలు దరఖాస్తు చేసుకొనేందుకు వీలుకల్పించలేదు. పీఎం కిషాన్ పథకం వర్తింపుకు ఫిబ్రవరి 1, 2019 వరకు పట్టేదారు పాసుబుక్కులు పొందిన రైతులు కాగా… ఆతర్వాత కొత్తగా పట్టేదారు పాసుబుక్కులు పొందిన రైతులకు కేంద్రం దరఖాస్తు చేసుకొనేందుకు మరల అవకాశం ఇవ్వలేదు.
డివిజన్లో 5వేల4వందల మంది రైతులకు లబ్ధి
పట్టేదారు పాసుబుక్కు ఉన్న ప్రతీ రైతుకు ప్రతీ ఎకరానికి రైతుబందు పథకం అమలయ్యేందుకు కేసీఆర్ నిబందనలో రూపొందించగా, పీఎం కిసాన్ పథకం ఒక ఇంట్లో ఎంత మందికి పట్టేదారు పాసుబుక్కు ఉన్న ఒకరికే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇదొక్కటే కాకుండా ఇంకా పీఎం కిసాన్ కు కోతలు పెట్టేందుకు అనేక కొర్రీల నిబందనలున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి డివిజన్లో ఫిబ్రవరి 1, 2019 తర్వాత నుంచి ఇప్పటివరకు కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టేదారు పాసుబుక్కు పొందిన రైతులు 5వేల4వందల మంది ఉన్నారు. భూమితో సంబంధం లేకుండా నియమనిబందనలకు లోబడి ఉన్న రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం క్రింద ప్రతియేటా ప్రతీ దఫాకు రూ.2వేలచొప్పున మూడు దఫాలుగా అందిస్తుండగా… ఇప్పటివరకు 19దఫాలుగా రైతుల ఖాతాల్లో పీఎం కిషాన్ డబ్బులను కేంద్రం జమచేసింది. డివిజన్లో రైతుబందు (భరోసా) పథకం 56వేల974మంది రైతులు లబ్ది పొందుతుండగా, పీఎం. కిషాన్. పథకం కేవలం 35వేల 672మంది రైతులకు కేంద్రం వర్తింపజేస్తుంది.
పీఎం కిసాన్ కు కేంద్రం అవకాశమివ్వాలి : పుట్టపాక శ్రీకాంత్, ఇప్పల్ నర్సింగాపూర్
నేను రెండేళ్ల క్రితం 35 గుంటల భూమిని గ్రామంలో కొనుగోలు చేశాను. రాష్ట్రం పెట్టుబడి క్రింద ఇచ్చే రైతుబందు (భరోసా) పథకం డబ్బులు ఖాతలో జమఅవుతున్నాయి. పీఎం కిసాన్‌కు అమలుకు కేంద్రం మరోసారి అవకాశమివ్వాలి. కేసీఆర్ రైతుబంధు మాదిరిగా పీఎం కిషాన్ నిరంతర పక్రియ ఉండేలా చూడాలి.
రైతులందరికీ వర్తింపజేయాలి : ముషం వెంకటేశ్వర్లు, రాంపూర్
2
రైతుబందు లెక్క పీఎం కిషాన్ పథకం ప్రతీ రైతుకు వర్తింపజేయాలి. మా నాయన వారసత్వంగా నాకు గ్రామంలో కొంత వ్యవసాయభూమి సంక్రమించిం మూడేండ్లు దాటుతోంది. అయిన ఇప్పటివరకు కేంద్రం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు.