బ్రిస్బేన్: బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్స్ రికార్డు సృష్టించింది. లీగ్ దశలో ఆ జట్టు.. పెర్త్ స్కాచర్స్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే ఛేదించి ఈ లీగ్‌లోనే రికార్డు ఛేజ్ (గతంలో 230 పరుగులే అత్యధిక ఛేదన)ను విజయవంతంగా పూర్తిచేసింది.
ఛేదనలో జాక్ విల్డర్మత్ (54 బంతుల్లో 110*), మాథ్యూ రెన్షా (102) శతకాలతో రెచ్చిపోయారు.