కొడిమ్యాల, జూలై 17 : భర్తను హత్య చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సెషన్స్ జడ్జి శ్రీమతి రత్నపద్మావతి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు కొడిమ్యాల ఎస్సై నరేశ్ తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన బత్తుల ప్రమీల వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త శ్రీనుతో 2022 నవంబర్ 11న వివాదం జరిగింది.
రాత్రి శ్రీను నిద్రిస్తున్న సమయంలో ప్రమీల అతడిని హత్య చేసి, చీరతో ఉరేసుకున్నట్టు నమ్మించింది. శ్రీను కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమీలపై కేసు నమోదుచేశారు. మల్యాల సీఐ కోటేశ్వర్, రమణమూర్తి దర్యాప్తు చేసి కోర్టులో ఆధారాలు సమర్పించారు. పీపీ రామకృష్ణారావు కోర్ట్ డ్యూటీ అధికారులకు సాక్ష్యాధారాలు సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష ఖరారు చేశారు.