కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. కొవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని తెలుసుకునేందుకు, నిరోధానికి పెద్ద ఎత్తున ఎందుకు పరీక్షలు చేయలేదని ప్రశ్నించారు. వేరియింట్కు వ్యతిరేకంగా టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చెప్పాలని, పూర్తి సమాచారం ఎప్పుడు లభిస్తుందన్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు నియంత్రించే ప్రణాళిక ఏంటీ? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డెల్టా ఫ్లస్ వేరియంట్ మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డెల్టా ఫ్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. దేశంలో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాలు బాధిత జిల్లాల్లో నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. డెల్టా లేదా B.1.617.2 వేరియంట్లోని మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ ఉత్పరివర్తనం చెందిందని.. అయితే దాని తీవ్రత ఇంకా తెలియదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో రెండు రోజులు మోస్తరు వానలు
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ
శ్రీశైలం జలాశయానికి వరద
నేటితో రైతుబంధు సాయం పంపిణీ పూర్తి
చైనా మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి
విండోస్ 11 విడుదల చేసిన మైక్రోసాఫ్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన.. మద్దతు తెలిపిన హరీశ్ రావు
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’ ట్రైలర్ విడుదల.. లాయర్‌గా అదరగొట్టిన బ్యూటీ!
Ram Charan | RC17 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. డిసెంబర్ చివరి వారంలో రామ్‌చరణ్-సుకుమార్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్!
KTR | తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

