బీజింగ్ : చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం సెంట్రల్ చైనాలోని మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో చోటు చేసుకుంది. హెనాన్ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో శుక్రవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారని, 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ నెల 13న సెంట్రల్ హుబెయి ప్రావిన్స్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. భద్రతా నిర్వహణలో లోపాలు బయటపడడంతో కంపెనీకి చెందిన ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.