పానిండియా స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. స్పిరిట్, కల్కి 2, సలార్- శౌర్యాంగపర్వం చిత్రాలు వెయిటింగ్లో ఉన్నాయి. ఇవిగాక నేనూ ఉన్నానంటున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అసలు ఇంత బిజీగా ఉన్న ప్రభాస్.. ప్రశాంత్‌వర్మకు ఓకే చెప్తాడా? అనేది ఫిల్మ్ వర్గాల్లో నెలకొని ఉన్న ప్రశ్న.
అయితే.. తాను ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్టు రీసెంట్గా క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్‌వర్మ. ‘ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్‌పై పెద్దగా మాట్లాడేదేంలేదు. మేమైతే షూటింగ్ కోసం రెడీగా ఉన్నాం. హీరోగారి డేట్స్ దొరకడమే తరువాయి. పట్టాలెక్కించేస్తాం’ అన్నారాయన. ఇప్పటికే ఆయన ‘బ్రహ్మరాక్షస’ అనే కథను ప్రభాస్‌కి వినిపించినట్టు విశ్వసనీయ సమాచారం.
ప్రభాస్ కూడా ఓకే చెప్పారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికి రెండుమూడేళ్లు పట్టడం ఖాయం. ఈ లోపు ‘జై హనుమాన్’ ఎలాగూ ఉంది. ప్రశాంత్‌వర్మ యూనివర్స్‌లో దటీజ్ మహాలక్ష్మి, అధీరా, మహాకాళి లైన్లో ఉన్నాయి. వీటి తర్వాత ‘బ్రహ్మరాక్షస’ మొదలవుతుందన్నమాట.