RS Praveen Kumar | స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్‌పై విద్యార్థుల ఆగ్రహం వ్యక్త చేస్తున్నారని తెలిసిందే. పాలిటెక్నిక్ విద్యార్థినులను లేబర్లుగా మార్చేస్తున్నారని.. శక్తి స్కీమ్‌లో పాలిటెక్నిక్ కాలేజీని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వెంటనే శక్తి స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది.
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు మద్దతు తెలిపారు. విద్యార్థులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల వేలాది మంది విద్యార్థులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్లు భవిష్యత్ గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబసమేతంగా ఢిల్లీకి పోయి.. ఢిల్లీ నుంచి లండన్‌లో పెళ్లిళ్లకు పోయి అక్కడి నుంచి కొన్ని రోజులు హాయిగా సరదాగా గడిపేందుకు అమెరికాకు వెళ్లారు. ఇక్కడనేమో మీకు ఓటేసిన తల్లిదండ్రుల గర్భాన పుట్టిన బిడ్డలు తెలంగాణ పేదింటి ముద్దుబిడ్డలు రోడ్డు మీద ఇవాళ హాహాకారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మీ ఆదేశాల మేరకు మీ కిందనే పనిచేస్తున్న పోలీసులు ఈ బిడ్డలందరి మీద ఘోరంగా దౌర్జన్యాలు చేశారు. రేవంత్ రెడ్డి విద్యార్హతలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన విద్యార్థి దశలో వనపర్తిలో పాలిటెక్నిక్ చదివిండు. దాని తర్వాత ఆయన ఏవీ కాలేజీలో బీఏ చేసిండు. దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిండు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిండు.. మీరు వనపర్తిలో పాలిటెక్నిక్ చేసి సికింద్రాబాద్ ఏవీ కాలేజీలో బీఏ చేసి మళ్లీ తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది.. మీరు పాలిటెక్నిక్ చేసి బీఏ చేయగలిగినప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలకు పోతే తప్పేంది అనేది ఎప్పుడైనా..ఆలోచించిర్రా..? అని ప్రశ్నించారు.
నువ్వు కూడా పాలిటెక్నిక్ చేసి బీఏ చేశావు కదా రేవంత్ రెడ్డి
మరి ఈ విద్యార్థులు పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేస్తే తప్పేంటి?
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/8FaoXvXXer pic.twitter.com/566ig3bGB8
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026
రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మాత్రం లండన్‌లో పెళ్లికి పోయారు
అటు నుండి అటు అమెరికా పోతున్నారు.. కానీ ఇక్కడ మీ ఆదేశాల మేరకు ఈ బిడ్డల మీద నిన్న పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు
-… https://t.co/3or8gOfywc pic.twitter.com/lvB7mWaQ5I
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026